జనం న్యూస్ జూన్ 2, రావికమతం విలేఖరి గుమ్మడి వెంకటేశ్వరరావు కొత్త కోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల చీమలపాడు పంచాయతీలో గల చలి సింగం గ్రామంలో గురువారం డాక్టర్ సురేఖ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం ఏర్పాటు చేయడ మైనది.ఓపి .88. ఆర్ టిడీ కిట్ తో 70 మందికి పరీక్షలు చేయగా అందరికీ మలేరియా లేదని నిర్ధారణ వచ్చినది అందరూ సిరివ్యాధులతో బాధపడుతున్నారని వాళ్ళందరూ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగినది. కీటక జనతా వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త గా దోమతెరలు వాడాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాచి మరగబెట్టిన నీరును తాగాలని వేడివేడి పదార్థాలు తినాలని, ఆరోగ్య విస్తరణ అధికారి పాతాళ రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ పియస్నాయుడు.యస్ వై.నాయుడు.,బి.జయ కృష్ణ ఆసాలు పాల్గొన్నారు