జనం న్యూస్, గుండాల జూన్. 28.పి. యాదగిరి, బాధితుడికి ఆర్థిక సహాయం అందించిన కాంగ్రెస్ నేతలు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం గ్రామంలో గురువారం రాత్రి కుక్కల దాడిలో 36 గొర్రెలు మృతి చెందాయి. బాదిత గొర్రెల కాపరి ఇట్టబోయిన యాదగిరికి జీవనాధారమైన గొర్రెలు మృతి చెందడంతో కన్నీరుమున్నీరయ్యాడు. విషయం తెలుసుకున్న ఆలేరు ఎంఎల్ఏ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అక్కడి స్దానిక నాయకులకు పలు ఆదేశాలను జారీ చేశారు. దీంతో వారు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాదిత గొర్రెల కాపరిని పరామర్శించి .బాధితుడికి మానవతా దృక్పథంతో ధైర్యం చెప్పి ఈరసారపు యాదగిరి గౌడ్ రూ. 20 వేలు, అండెం సంజీవరెడ్డి రూ. 10 వేలు వ్యక్తిగతంగా తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వ పరంగా కూడా తగిన నష్టపరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఇమ్మడి దశరథ గుప్తా, మాజీ ఎంపీపీలు నూనెముంతల వెంకటేశ్వర్లు, సంగీ వేణుగోపాల్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ గోలుకొండ యాదగిరి, సర్పంచులు తాన్యా నారాయణస్వామి, వల్లాల రమేష్, నాయకులు ఏలూరి రాంరెడ్డి, చిన్నం ప్రకాష్, దార సైదులు, ఆంజనేయులు, శ్రీను తదితరులు ఉన్నారు