జనం న్యూస్. 30.6.2026 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు చేగుంట మండల కేంద్రo లో అంతర్జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా ప్రాథమిక వైశాయ సహకార సంఘం చేగుంట చైర్మన్ బోనగిరి బాగులు చేత పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని సొసైటీ ద్వారా రైతులకు దీర్ఘ కాలిక పంట రుణాలు అందించి ఆదుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బాగులు సొసైటీ డైరెక్టర్లు, రైతులు, సెక్రెటరీ సందీప్, సిబ్బంది విష్ణు, లక్ష్మణ్, పాల్గొన్నారు.