అక్రమ ఇసుక రవాణా..ముగ్గురు అరెస్ట్.. ఎస్సై ఆవుల తిరుపతి హెచ్చరిక

జనం న్యూస్, జూలై 2(జిల్లా ఇంచార్జ్ ) వీణవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి ఇసుక క్వారీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, వారిపై కేసు నమోదు చేశారు.ఎస్సై ఆవుల తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం, పోతిరెడ్డిపల్లి ఇసుక క్వారీ నుంచి తెల్లవారుజామున అక్రమంగా ఇసుక రవాణా జరుగుతోందనే నమ్మదగిన సమాచారం అందడంతో దాడి నిర్వహించామన్నారు . తనిఖీల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని, వాటి డ్రైవర్లు, యజమానులను అదుపులోకి తీసుకున్నామని, అరెస్టైన వారిలో పోతిరెడ్డిపల్లికి చెందిన పి. సాయికృష్ణ (25), నాగపూరి అరవింద్ (25), జీల పర్శరాములు ఉన్నారన్నారు . వీరి వద్ద నుంచి టి ఎస్ 02 ఇ వై 6313, టి ఎస్ 25 టీ 2958, టి ఎస్ 02 ఇ జి 7251 నంబర్ల వాహనాలతో పాటు నంబర్ లేని మహీంద్రా ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు .నిందితులపై సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు . ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఇ సందర్బంగా ఎస్సై ఆవుల తిరుపతి హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *