బిజినపల్లిలో మోసపోయిన రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

జనం న్యూస్ జులై 03 ప్రతినిది ఎండీ జహంగీర్ . నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో దళారి వ్యాపారుల చేతిలో మోసపోయిన రైతులను గురువారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఓదార్చారు పోలీస్ స్టేషన్కు చేరుకున్న బాధిత రైతులతో ఆయన సమస్యలు అడిగి తెలుసుకొని దళారులను అదుపులోకి తీసుకొని రైతులకు చెల్లించవలసిన 90 లక్షల రూపాయలను వారి నుండి వసూలు చేసి బాధిత రైతులకు ఇప్పించాలని స్థానిక ఎస్సై శంషాద్దీన్ కి సూచించారు. మండల పరిధిలోని పలు గ్రామాల రైతులు మొక్కజొన్న పంటలు పలువురు దళారులకు విక్రయించడం జరిగిందని వారు రైతులకు చెల్లించవలసిన డబ్బులను చెల్లించకుండా పరారీలో ఉన్నారని వెంటనే పూర్తి విచారణ చేసి వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. రైతులు ఎవరు ఇబ్బందులు పడవద్దని వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్న ఒక రైతుల ఉద్దేశించి దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఏడుపు పరిష్కారం కాదని ప్రభుత్వం కొనుగోలు చేసిన కేంద్రాలలో విక్రయిస్తే ముఖ్యమంత్రితో మాట్లాడిన డబ్బులు ఇప్పించేవాడినని అయినప్పటికీ దళారులను అదుపులోకి తీసుకొని కొద్ది రోజుల్లోనే డబ్బులు ఇప్పించేలా ప్రయత్నం చేస్తానని అన్నారు . లైసెన్స్ లేని దళారులను ఆశ్రయించవద్దని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల్ జ్వరం నాగయ్య మిద్దె ఇందిర రాములు మరేపల్లి శివ లీల చంద్ర గౌడ్ పులియా నాయక్ పాండు నాయక్ కృష్ణ నాయక్ పానుగంటి నరసింహ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఎండి నజీర్ వాలియా నాయక్ మాజీ సర్పంచులు గంగనమొని తిరుపతయ్య బాలరాజు మూడవత్ గోవిందు నాయక్ మాజీ ఎంపిటిసిలు గడ్డం రామచంద్రయ్య మల్లికార్జున రెడ్డి కార్యకర్తలు ముక్తార్ పాషా సైదులు కతే ఈశ్వర్ మాజీ జెడ్పిటిసి పరశురాములు మాజీ ఎంపీపీ రాములు బాలపిరు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *