రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికై కృషి చేయండి

*అనంతపురం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ ఎం.రాజశేఖర్*


జనం న్యూస్, అనంతపురం, జులై 02 : రిపోర్టర్ ముంగా ప్రదీప్ అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో గల న్యాయ సేవా సదన్ నందు అనంతపురం అర్బన్, రూరల్ పరిధిలో గల పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు మరియు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, మరియు పోలీస్ వారితో గురువారం అనంతపురం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ ఎం.రాజశేఖర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జులై 11వ తారీఖున జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు అనంతపురం అన్ని స్టేషన్ల పరిధిలోగల రాజీ పడదగ్గ కేసులను నిర్ధారించి వాటి వాటి పరిష్కారానికోసం శాయశక్తులా కృషి చేయాలన్నారు. మన అనంతపురం జిల్లాలో సంఖ్యాపరంగా ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేటట్టు కృషి చేయాలని హాజరైనటువంటి పోలీస్ అధికారులను జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జడ్జి ఎం.రాజశేఖర్ కోరారు. ఈ సమావేశంలో అనంతపురం రూరల్ డిఎస్పి శ్రీనివాసులు మాట్లాడుతూ వారి వారి పరిధిలో గల స్టేషన్లో అర్హత కలిగిన కేసులను గుర్తించాలని వారి అధికారులను కోరుతూ కావలసినటువంటి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సమావేశంలో అనంతపురం వన్ టౌన్, టూ టౌన్, పోర్ట్ టౌన్, రూరల్ మరియు ట్రాఫిక్ బుక్కరాయసముద్రం ఇన్స్పెక్టర్లు మరియు రాప్తాడు ఇటుకలపల్లి ఆత్మకూర్, గార్లదిన్నె మరియు నార్పలకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *