జనం న్యూస్ జులై 2 మంథని టౌన్ రిపోర్టర్ (కుంట పోశెట్టి) మంథని ప్రభుత్వ సామాజిక వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిని గురువారం డిసిహెచ్ఎస్ డాక్టర్ కొండ శ్రీధర్ ఆకస్మిక తనిఖీ చేశారు.రోగులకు అందుతున్న వైద్య సేవలను పేషెంట్ అటెండర్స్ ను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్స్ తనిఖీ చేసి అనంతరం ప్రతి ఒక్కరు తప్పకుండా సమయ పాలన పాటించాలని సూచించారు. ప్రతి వార్డును తిరిగి టాయిలెట్స్ పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని సానిటేషన్ సిబ్బందికి తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా పేషెంట్లకు మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. గత కొంత కాలంగా రక్త పరీక్షల నిమిత్తం 20 రూపాయల సంబంధించి వసూలు చేయడం జరుగుతుందని దాని గురించి కలెక్టర్ గారితో మాట్లాడి త్వరితగతిన నిర్ణయం తీసుకొని ప్రజలకు ఉచిత రక్త పరీక్షలను చేయడం జరుగుతుందని తెలిపారు. రానున్న రోజులలో ఆసుపత్రిని పెద్దమొత్తంలో అభివృద్ధి చేసి మంథని ప్రాంత ప్రజలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందజేస్తామని జిల్లా సూపర్డెంట్ డాక్టర్ శ్రీధర్ అన్నారు.వారి వెంట డ్యూటీ డాక్టర్ ఆకాంక్ష, హాస్పిటల్ ఆఫీసు జూనియర్ అసిస్టెంట్ అమల అన్ని విభాగాల సిబ్బంది ఉన్నారు.