జనం న్యూస్ జూలై 1 రిపోర్టర్ ఉపేందర్ నడిగూడెం) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో వీజీబీఆర్‌జీ బిల్లును రద్దు చేసి, ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే కొనసాగించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, సీనియర్ నాయకులు ఏనుగుల వీరాంజనేయులు, గీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు, ప్రకాష్, వెంకన్న, శ్రీను, నగేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.