సమస్యలు తెలుసుకుంటూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ…

జనం 1 జూలై 2026 బండి ఆత్మకూరు మండలం,శ్రీశైలం నియోజకవర్గం,నంద్యాల జిల్లా : శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని ఏ కోడూరు గ్రామం లో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు కార్యక్రమంలో ఉదయం 7.00 గంటలకే సచివాలయం సిబ్బంది తో కలిసి గ్రామ టీడీపీ నాయకులు వడ్డు మధు సుధాన్ రెడ్డి ప్రజలతో కలిసి వారిని ఎంతో అప్యాయంతో పలకరించకుటు ప్రజలు సమస్యలు వింటూ, ఏమ్మెల్యే మరియు అధికారులు తో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుకుంటూ పెన్షన్లు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షేక్ కొట్టాల జమల్ ఎన్టీఆర్ భరోసా పెన్సెన్ వస్తూ అనారోగ్యంతో గత నెలలో మరణించారు.వారి భార్య స్థానిక టీడీపీ నాయకులు వడ్డు మధు సుధాన్ రెడ్డి ని కలసి సమస్యను చెప్పడంతో ఆయన సంబంధిత అధికారులు తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. బుధవారం నాడు జులై 1 తేదీ షేక్ జాఫర్బికి స్పోష్ పెన్సెన్ అందజేశారు… వారి కుటుంబ సభ్యులు వడ్డు మధు రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది రవికుమార్ ,శ్రీనివాస్, ప్రజలు పాల్గొనారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *