శ్రీ మారేమ్మ దేవాలయంలో పోతుల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కంటి అద్దాల పంపిణీ

*వృద్ధుల సమక్షంలో పోతుల రామకృష్ణరెడ్డి జన్మదిన వేడుకలు

జనంన్యూస్ జూన్ 30 (గోరంట్లమండల ప్రతినిధి ఫక్రోద్దీన్) : గోరంట్ల మండలం నార్సింపల్లి గ్రామపంచాయతీ బాలన్నగారిపల్లికి చెందిన సమాజ సేవకుడు పోతుల రామకృష్ణారెడ్డి, ఆయన సతీమణి పోతుల నాగరత్నమ్మ జన్మదిన వేడుకల సందర్భంగా బుధవారం నిర్వహించబోతున్నారు అందులో భాగంగా ఒక్కరోజు ముందుగా మంగళవారం గోరంట్ల మేజర్ పంచాయతీ గుమ్మయ్యగారిపల్లిలో వెలసిన శ్రీ మారెమ్మ దేవి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో గోపూజతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన వృద్ధులకు గోరంట్ల పట్టణంలోని ఆరోమ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. పోతుల రామకృష్ణారెడ్డి తన సొంత నిధులతో 15 మంది వృద్ధులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం పోతుల రామకృష్ణారెడ్డి వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అలాగే శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ సహకారంతో ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి. దేవిరాజు స్వామి ఆలయ కమిటీ తరఫున పోతుల రామకృష్ణారెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ మారెమ్మ దేవి ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ బి. దేవిరాజు స్వామి, పోతుల రామకృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పుటక శంకర్, సాయినాథ్ రెడ్డి, ఎస్‌ఎస్‌ఎఫ్ లక్ష్మీనారాయణ, ఆర్ఎస్ఎస్ ఖండ కార్యవాహక హరినాథ్ రెడ్డి, గురువిరెడ్డి తదితరులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *