జనం న్యూస్ జూన్ 30 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ ఎండీ జహంగీర్ బిజినపల్లి మండలంలోని లింగసానిపల్లి గ్రామంలో జల మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేసే తాగునీటిని గ్రామాలకు పంపే ముందు అన్ని రకాల నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు. అలాగే గ్రామస్థులు కూడా తాగునీటి నాణ్యతను సులభంగా ఎలా పరీక్షించుకోవాలో అవగాహన కల్పించారు. వాటర్ ట్యాంకులను శుభ్రపరిచే విధానం, తాగునీటి పరిశుభ్రతను కాపాడే చర్యలు, మిషన్ భగీరథ నీటిని వినియోగించడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై సవివరంగా వివరించారు. ప్రతి కుటుంబం సురక్షితమైన తాగునీటిని వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడు కోవాలని సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లను శాలువాలతో సన్మానించి, వారి సేవలను అభినందిస్తూ స్వీట్లు పంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజినపల్లి ఏఈ మద్దిలేటి, వాటర్ ల్యాబ్ టెక్నీషియన్ శివ, గ్రామ సర్పంచ్ పిట్టల చంద్రకళ శ్రీరాములు, ఉపసర్పంచ్ చెంచేటి సత్యనారాయణ, గ్రామ కార్యదర్శి ప్రసన్న, మల్టీ పర్పస్ వర్కర్లు శేఖర్, రామచంద్రయ్య, బాలస్వామి, అలివేల, ఎల్లమ్మతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.