రైతు భరోసా కు దరఖాస్తు చేసుకోవాలి

(జనం న్యూస్-జూన్ 27 కందిబండ హరీష్ మునగాల మండల రిపోర్టర్) కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు పొందిన రైతులు, అలాగే రైతు భరోసా పథకంలో బ్యాంకు ఖాతా వివరాలు మార్చుకోవాల్సిన రైతులు జులై 5లోగా దరఖాస్తు చేసుకోవాలని మునగాల మండల వ్యవసాయ అధికారి బి.రాజు సూచించారు. అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత ఏఈఓ, మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సునీత, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *