జనం న్యూస్ 2026 జూన్ 28 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్ ) మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు మెదక్ పట్టణంలోని పిట్లం బేస్ ప్రాంతం, వార్డు నెం.14, 15లో ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, బీఎల్ఓ నీలిమతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎస్‌ఐఆర్ ఫారాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాల్గొని ప్రజలకు ఫారాలు నింపే విధానం, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ ఓటు ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కు అని పేర్కొన్నారు. ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తప్పనిసరిగా భాగస్వాములై, ఫారాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. తొందరపాటుకు తావివ్వకుండా సరైన వివరాలు నమోదు చేయాలని కోరారు.వార్డు నెం.14, 15 పరిధిలోని ప్రతి ఓటరు ఈ ప్రక్రియలో పాల్గొనాలని, ఫారాలు నింపడంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.