వి బి జీ రామ్ జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి.

జనం న్యూస్ ప్రతినిధి శ్రీరమణ జూలై 01 తేదీ 2026 పీ.ఏ.పల్లి మండలం నల్గొండ జిల్లా న్యూస్. వి బి జీ రామ్ జీ చట్టాన్ని ఉప సమరించుకోవాలిఎంపీడీవో ఆఫీసు ముందు ధర్నా పీఏ పల్లి మండల ఎంపీడీవో ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజి రామ్ జీ బిల్లు/చట్టాన్ని తక్షణమేఉపసంహరించుకోవాలనీ కోరుతూ ,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ పిలుపులో భాగంగానే మండల ఆఫీస్ ముందు ధర్నా జరుగుతుంది పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉపాధి దొరకొద్దని కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. నేడు 60 శాతం కేంద్రం 40 శాతం రాష్ట్రంగా కేటాయించాలని చట్టం చేయడం అన్యాయం అన్నారు ఇప్పటికే రాష్ట్రాలలో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో డబ్బులు కేటాయించకుండా ఉంటే కేంద్రం నుంచి పైసా కూడా రాదని దానివల్ల నా నిరుపేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా దళితులు గిరిజనులు, పేదలు ఉపాధి హామీ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వారి పొట్ట కొట్టడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా కనబడుతుందని విమర్శించారు. అదే జరిగితే సామాన్య ప్రజలు, రైతులు, పేద వర్గాలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గౌరవించి వి బి జి రాంజీ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వి బి జి రామ్ జి రద్దయించే వరకు ఉద్యమాలు చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు మూడవ చంద్రు నాయక్ కావలి కృష్ణయ్య సంఘం నాయకులు లక్ష్మయ్య దేవయ్య మెట్లు బొమ్మ ఎంకన్న గుండాల మల్లయ్య జాజుల రామలింగం సి హెచ్ సత్యనారాయణ విజయ భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *