మున్సిపాలిటీలో మురుగు నీటితో అంటువ్యాధుల ముప్పు అధికారుల నిర్లక్ష్యం

జనం న్యూస్ 29 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్. ఆలేరు మున్సిపాలిటీలో ప్రజా ప్రతినిధుల హామీలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయని పట్టణంలో సమస్యలు రోజురోజుకు పెరుగుపోతూ మున్సిపాలిటీ పరిధిలోని క్రాంతి నగర్ లో ఇళ్ల మధ్యనే నిలిచిన మురుగునీరు మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఓపెన్ నాలా వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపాలిటీలో మురుగునీటి పారుదల వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది అని పలు వార్డుల్లో డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగు నీరు ఇళ్ల మధ్యలో నిలిచిపోయి చెరువు లాగా తలపిస్తుంది అని మురుగు నిల్వలతో దుర్వాసన దోమల బెడద తీవ్ర రూపం దాల్చింది అని ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అవడంతో ఓపెన్ నాళాలు మరుగునీరు కాలనీలోకి చేరే ప్రమాదం ఉంది అని దీంతో సీజనల్ వ్యాధులు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయం కల్పన సంస్థ ద్వారా ఆలేరు మున్సిపాలిటీకి 15 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ అభివృద్ధి పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుందని నిధుల వినియోగంపై మున్సిపల్ అధికారులు పాలకవర్గం సరైన ప్రణాళికతో దృష్టి పెట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అనే విమర్శలు వస్తున్నాయి భారీ వర్షాలు పడకముందే అధికారులు పాలక మండలి స్పందించి అవసరమైన వార్డుల్లో అంతర్గత రోడ్డు డ్రైనేజీల నిర్మా ణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఆలేరు పట్టణ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *