జగన్ న్యూస్ జూన్ 28:- మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్ శాంతి నగర్ లో వారాంతపు సంత ( శనివారం మార్కెట్) ను మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ తో కలిసి జిల్లా అధికార ప్రతినిధి, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ. ప్రజలకు కూరగాయల మార్కెట్ అందుబాటులో ఉండాలని అన్నారు. వ్యాపారులు స్వచ్ఛమైన కూరగాయలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు చిట్టిబాబు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్, సీనియర్ నాయకులు భాగ్య, సుగుణ, సాయి కృష్ణ, గజ్వేల్ శంకర్, సరిత తో పాటు స్థానిక ప్రజలు, కూరగాయల వ్యాపారులతో పాటు తదితరులు పాల్గొన్నారు.