జనం న్యూస్, జూన్ 30( జిల్లా ఇంచార్జ్ ), జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం 4, 5, 19 వార్డుల్లో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (సర్ ) కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు, కరీంనగర్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎల్‌వో (బి ఎల్ ఓ )తో మాట్లాడి వార్డు ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారాలను అందజేశారు. ప్రతి అర్హ ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రజలు సహకరించాలని సూచించారు.అనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ దేశిని స్వప్నకోటి నివాసానికి మర్యాదపూర్వకంగా వెళ్లారు.వారికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.