ప్రాంతీయ ఆసుపత్రికి వాటర్ ఫ్లాంటు వితరణసాలూరు ఫ్లెండ్స్ అసోసియేషన్

జనం న్యూస్, మన్యం జిల్లా, సాలూరు, జూలై 2. సాలూరు ప్రాంతీయ ఆసుపత్రిలో భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశీస్సులతో నవంబర్ 15 -2021 లో ప్రారంభమై నేటికీ 1685 రోజులు నుండి నిరంతరము కొనసాగుతున్న అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిర్వహిస్తున్న సాలూరు ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఒక అడుగు ముందుకు వేస్తూ సుదూర ప్రాంతాల నుండి వైద్యం నిమిత్తం సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి వస్తున్న ప్రజల యొక్క దాహం తీర్చు నిమిత్తం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి శుద్ధ జల వాటర్ ప్లాంట్ ను వితరణ చేశారు. ఈ సందర్భంగా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రి సూపరిండెంట్ ఆర్.మీనాక్షి మాట్లాడుతూ ఎంతోమంది రోగులు సహాయార్థం వచ్చిన వారికి ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో కడుపునిండా అన్నం పెట్టి వారితో అన్నదాత సుఖీభవ అనిపించుకునే ఈ సాలూరు ఫ్రెండ్స్ అసోసియేషన్ వారిని ఆమె అభినందించారు. అంతేకాకుండా గతంలో ఈ సాలూరు ఫ్రెండ్స్ సభ్యులు రోగులకు పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారని ఆమె తెలియజేశారు. నిత్యము వందల మందికి కడుపునిండా అన్నము పెడుతూ, వారి దాహం తీరుస్తూ, వారి ఆశీర్వాదాలు పొందుతూ అన్నదాత సుఖీభవ కార్యక్రమం నిరంతరము కొనసాగిస్తూ ప్రజలు మనసులో స్థానం సంపాదించుకున్న సాలూరు ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులందరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండి భవిష్యత్తులో మరెన్నో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *