ప్రసన్నాంజనేయ స్వామివారి సేవలో ఎమ్మెల్యే జూలకంటి

జనం న్యూస్ బద్రి 25.6.26, మండల పరిధిలోని వేపకంపల్లి గ్రామంలో కొలువుదీరిన ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్ధానంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం ఆలయంలో ధ్వజస్తంబ ప్రతిష్టా మహోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ కమిటి సభ్యులు, వేదపండితులు ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంబం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలో కొలువుదీరిన స్వామి వారికి ఆకుపూజతో తరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎంపీపీ బొల్నేడి శ్రీనివాసరావు, దుర్గి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మునుగోటి సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు గోళ్ల సురేష్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ, చప్పిడి రాము తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *