ప్రభుత్వ పాఠశాలలను విద్యాశాఖ అధికారులు సందర్శించాలి.….బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం…

జనం న్యూస్, జులై 2, బోధన్ నియోజవర్గం బిడిఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బోధన్ పట్టణంలోని స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందర (బీడీఎస్ఎఫ్) విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి. అనంతరం విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు సంజయ్ తల్లారే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు సమస్యలకు నిలయంగా మారాయని ఆయన అన్నారు, మండల కేంద్రంలో కనీస సౌకర్యాలు లేకుండా ప్రభుత్వ బడులు నడుస్తున్నాయని ఆయన తెలియజేశారు, కనీస మౌలిక సదుపాయాలు లేవని విద్యార్థులు మూత్రశాలలు, మరుగుదొడ్లు అదేవిధంగా వర్షాకాలం సీజన్ వ్యాధులు సంబంధించిన మెడిసిన్లు ఆయా పాఠశాలలో పెట్టాలని ఆ విధంగా చొరవ తీసుకోవాలని బీడీఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా తమ ద్వారా కోరుతున్నామని అన్నారు. మండల కేంద్రంలో మధుమలాంచ స్కూల్ ఆకతాయిలకు అడ్డగా మారిందని రాత్రి అయితే చాలు అక్కడ బీర్ సీసాలు అదేవిధంగా ఆ సాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వారి పైన చట్టరిటా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా స్కూల్ కి ప్రవాహ కూడా నిర్మించి పాఠశాలకు రాత్రి సమయంలో రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన తెలిపారు* ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేతకు కుట్ర చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలి, ప్రవేట్, కార్పొరేట్ స్కూలలో 25% సీట్లను పేద బహుజన విద్యార్థులకు కేటాయించే విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పించాలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే 21 వస్తువుల కిట్ను అదేవిధంగా పాఠ్యపుస్తకాలను మరియు యూనిఫామ్స్ వెంటనే అందించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ స్కూల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్స్ తక్షణమే అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. విద్యాశాఖ అధికారులు కచ్చితంగా కార్యాలయానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ముఖ్యంగా ప్రభుత్వ బడులలో తనిఖీలు నిర్వహించి హైస్కూల్లో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి బహుజన విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ అధ్యక్షులు శ్రీ కిరణ్, కార్యదర్శి నరేందర్, జిల్లా నాయకులు రాజు, దీపక్, లాలూ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *