పదో తరగతి ఫలితాల్లో తెలుగు సబ్జెక్టులో 100 కి 100మార్కులు సాధించిన చల్లాల ఉమా నేహా శ్రీ.

జనం న్యూస్ మే రెండు మధిర టౌన్ ప్రతినిధి నండ్రు సుందర్ రావు. ఆంధ్రప్రదేశ్ లో గురు వారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో వంద మార్కులకు వంద మార్కులు తెలుగు సబ్జెక్టులోసాధించి మాతృభాషపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న మా విద్యార్థిని చల్లాల ఉమా నేహ శ్రీ. ఈ విద్యార్థి జేమ్స్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకున్నది. ఈ విద్యార్థిని చిన్నతనం నుంచి మంచి క్రమశిక్షణ అంకితభావం పట్టుదల కలిగినటువంటి విద్యార్థి ఈ లక్షణాలన్నింటినీ తల్లిదండ్రు దగ్గరనుంచి పునికి పుచ్చుకున్న సుగుణాలు. అందరితో కలిసి మెలిసి ఉంటూ చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించేది ఇ లాంటి ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన ఈ విద్యార్థినికి మాతృభాష అంటే మక్కువ ఎక్కువ అందుకనే పదవ తరగతి ఫలితాల్లో తెలుగు సబ్జెక్టులో 100కు వంద100 మార్కులు సాధించి తనకు మాతృభాషపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నది అదేవిధంగా 2024 25 బ్యాచ్ లో కూడా ఉమామహేశ్వరి అనే విద్యార్థిని కి కూడా తెలుగు భాష పై అభిమానం ఎక్కువ రామాయణాన్ని అవలీలగా చెప్పగలిగినటువంటి మా ఉత్తమ విద్యార్థిని ఈ విద్యార్థికి కూడా 2024 25 వ సంవత్సరంలో పదవ తరగతి ఫలితాలలో తెలుగు సబ్జెక్టులో వందకు వంద మార్కులు సాధించి మాతృభాషపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నది ఈ విధంగా గత రెండు సంవత్సరాల నుంచి తెలుగు సబ్జెక్టులో వందకు వంద మార్కులు సాధించి జేమ్స్ పాఠశాలలో చరిత్రను సృష్టించారు .ఈ విధంగా వంద మార్కులు సాధించడానికి ప్రధాన కారకులు జేమ్స్ పాఠశాలలో మాతృభాష ఉపాధ్యాయులు మరియు జనం న్యూస్ మధిర టౌన్ విలేకరుగా పనిచేస్తున్న నండ్రు సుందర్ రావు కృషి మరువలేనిది మర్చిపోలేనిది అందుకనే రెండు సంవత్సరాల నుంచి వంద మార్కులు సాధిస్తున్న మా విద్యార్థులని మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ అభినందిస్తూ ఉన్నాను అని మాతృభాష ఉపాధ్యాయులు నందు సుందర్ రావు అన్నారు. అందుకు మా విద్యార్థులు మీ కృషి నీ మీ సహాయ సహకారాలను మాతృభాష బోధనా విధానాన్ని జీవితంలో మర్చిపో లేమని మాతృభాష ఉపాధ్యాయుడిని ఉద్దేశించే తమ అభిప్రాయాలను ఉమామహేశ్వరి మరియు ఉమా నేహా శ్రీ వాళ్ళ అభిప్రాయాలనువ్యక్తం చేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *