ప్రకృతి వైపరీత్యానికి ధ్వంసమైన పేదల ఇల్లు

*సరియలబంద గ్రామం సందర్శించిన పెద్దలు వాసింగి వైసిపి ఎంపీటీసీ గబ్బడి సన్యాసి దొర

జనం న్యూస్ మే 2 జి.మాడుగుల (విలేకరి కృష్ణబాబు) అల్లూరి సీతారామరాజు జిల్లా జిమాడుగుల మండలం పరిధిలోని పెద్దలువా సింగి సరియాలబంద గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇల్లు కుప్పకూలి పోయిందనీ ఆ గ్రామానికి సందర్శించిన పెద్ద లువ్వా సింగి వైసిపి ఎంపీటీసీ గబ్బడి సన్యాసి దొర తెలిపారు. గ్రామంలోని గబ్బడి రాంబాబు ఇల్లు పై రేకులు పూర్తిగా ధ్వంసం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు పరిశీలించి నష్టపోయిన కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ఆయన తెలిపారు ఇల్లు కూలిపోవడంతో సుమారు 25,000 నుండి 50,000 వేల వరకు ఆస్తి నష్టం వాటిలిందని ఆయన తెలిపారు . తక్షణమే సంబంధిత అధికారులు గ్రామాన్ని సందర్శించి ఆ కుటుంబానికి నష్టపరిహారం అందేలా చూడాలని వైసిపి ఎంపీటీసీ గబ్బడి సన్యాసి దొర తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *