జనం న్యూస్ 26 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పాత ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ‘మన’ డ్రగ్స్ డీ-అడిక్షన్ (వ్యసన విముక్తి) కేంద్రాన్ని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చికిత్స పొందుతున్న వారి కోసం నిర్వాహకులకు నోటు పుస్తకాలను, ఆట వస్తువులను ఆయన అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మద్యపానం డ్రగ్స్ ఆల్కహాల్ తంబాకు వంటి రకరకాల మత్తు పదార్థాలకు బానిసలైన వారిని ఆ వ్యసనాల నుంచి దూరం చేసి, వారికి పునరావాసం కల్పించడమే ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మత్తు పదార్థాలు ఉపయోగించే వారిపై ప్రతిరోజూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారికి కౌన్సిలింగ్ ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యసనపరులు తమ అలవాట్లను మానుకుని సాధారణ జీవితం గడిపేలా ఇక్కడ అన్ని వసతులతో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు గద్వాల సర్కిల్ ఇన్స్పెక్టర్ (సి ఐ ) టంగుటూరి శ్రీను, గద్వాల్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ (యస్ ఐ) కళ్యాణ్ కుమార్ మరియు కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.