
జనం న్యూస్ జగిత్యాల జిల్లా ఇన్చార్జి బండారి బీరయ్య సెప్టెంబర్ 2 జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలంలోని మహానేత, దివంగనెత మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా పెగడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కడారి తిరుపతి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన ప్రజలకు, రైతులకు, పేదలకు చేసిన సేవలను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ ఏఎంసీ డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు, మండలంలోని అన్ని గ్రామాల సర్పంలు, ఉప సర్పంచులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతుల బాంధవుడిగా.. పేదల పక్షపాతిగా డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రజల పక్షపాతిగా, రైతుల బాంధవుడిగా, పేదల సంక్షేమానికి అంకితభావంతో పనిచేసిన మహానేతగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నాయకులు పేర్కొన్నారు.ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, జలయజ్ఞం వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయని గుర్తు చేశారు.మహానేత చూపిన ప్రజా సంక్షేమ మార్గంలో నడుస్తూ, ప్రజల కోసం నిరంతరం పనిచేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. మహానేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి పవిత్ర స్మృతికి ఇవే మా ఘనమైన నివాళులు.