125 రోజుల వికసిత భారత్ – జీ రామ్‌జీ కార్యక్రమం ఘనంగా ప్రారంభం

జనం న్యూస్ మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం02/07/2026 ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి శ్రీ గుడూరు ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రారంభించిన “వికసిత భారత్ – జీ రామ్‌జీ” కార్యక్రమాన్ని ఈరోజు పుల్లలచెరువు మండలం, ఐ.టి.వరం గ్రామ పంచాయతీలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుల్లలచెరువు మండల టీడీపీ కన్వీనర్ పోట్ల గోవిందు, పావులూరి మన్నేయ్య, గద్దె మల్లయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సూరాబత్తిని రాముడు, సోమెపల్లి కోటయ్య, సోమేపల్లి సుబ్బారావు, శీలం కోటేష్, టిఏ వెంకట్రావు పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *