నిందితులను అరెస్టు చేయకుంటే పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తాం: దళిత సంఘాల హెచ్చరిక

జనం న్యూస్ జులై 3(రిపోర్టర్ రాజు)మోహరం పండుగ సందర్భంగా వజ్రకరూరు మండలంలోని పి.సి.పి. కొత్తకోట గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి (డీజీహెచ్ఎస్ఎస్) వ్యవస్థాపకులు మీనుగా గోపాల్ డిమాండ్ చేశారు.గురువారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి దళిత నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోహరం సందర్భంగా జరిగిన ఘర్షణలో ఐదుగురు దళితులు గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనపై జూన్ 27న వజ్రకరూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు కాగా, జూన్ 28న డీఎస్పీ విచారణ నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపకపోవడం బాధాకరమన్నారు.అంతేకాకుండా బాధితులపైనే సుమారు 30 మందిపై కౌంటర్ కేసులు నమోదు చేయడం అన్యాయమని ఆరోపించారు. అసలు నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు, బాధితులపై నమోదు చేసిన కౌంటర్ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో గ్రామస్థాయి దళితులు, దళిత సంఘాల నాయకులు ఏకమై వచ్చే సోమవారం వజ్రకరూరు పోలీస్ స్టేషన్ ఎదుట భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పాల్తూరు ఆనంద్, లత్తవరం చంద్రశేఖర్, ఎమ్మార్పీఎస్ తాలూకా అధ్యక్షుడు రాంపురం చెన్నప్ప, వజ్రకరూరు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు పురుషోత్తం, కోనాపురం ఎర్రిస్వామి, పోలేరు, మాజీ ఎంపీపీ తిప్పయ్య, బీమా, హావలిగి చక్రవర్తి, ఎర్రిస్వామి, బాట నాగరాజు, తలారి వన్నూరుస్వామి, రాకెట్ల నాగయ్య, చాపిరి పెన్నయ్య, శ్రీనివాసులు, లత్తవరం రామాంజి, బాట గోపాల్, గడేకల్ రామాంజనేయులు, కట్లపూడి కిష్టా తదితర దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *