జనం న్యూస్ జూలై 1 చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం రిపోర్టర్ భీమనేని బాలకృష్ణ. రొంపిచర్ల మండలం పెద్ద గొట్టిగల్లు శ్రీనాథపురంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్ అందజేశారు. సంక్షేమ పథకాల అమలుతో పేదరికాన్ని తగ్గించాలని సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.