వీణవంక మండల లబ్ధిదారులకు రూ.6.45 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

జనం న్యూస్ , జూన్ 30(జిల్లా ఇంచార్జ్ ) వీణవంక మండలానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబు మంగళవారం పంపిణీ చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో వీణవంక మండలంలోని 12 గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.6,45,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రణవ్ బాబు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిరుపేదలకు అవసరమైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఎండీ సాహెబ్ హుస్సేన్, గంగాడి తిరుపతి రెడ్డి, కూర్మిండ్ల తిరుపతయ్య, నల్ల కొండల్ రెడ్డి, మసాడి చొక్కారావు, అలె మధుసూదన్, ఎల్కపల్లి లక్ష్మణ్, రాచపల్లి సంపత్, మార్కెట్ డైరెక్టర్ శ్రీపతి రెడ్డి, సునీల్, మాజీ సర్పంచులు మేకల ఎల్లారెడ్డి, మ్యాక వీరయ్య, చిన్నాల ఐలయ్యతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *