జూనియర్ షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు గోరంట్ల బాయ్స్ హైస్కూల్ విద్యార్థుల ఎంపిక

జనంన్యూస్ జూన్ 30(గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) : అనంతపురంలోని శారదా మున్సిపల్ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్ షూటింగ్ బాల్ క్రీడా పోటీలలో గోరంట్ల బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనగా, గోరంట్ల బాయ్స్ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ ప్రతిభతో రాష్ట్రస్థాయి పోటీల్లో చోటు సంపాదించారు. రాష్ట్రస్థాయి జూనియర్ షూటింగ్ బాల్ పోటీలు జూలై 11న పులివెందులలో జరగనున్నాయి. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు: తరుణ్ – 9వ తరగతి గగన్ – 9వ తరగతి విద్యార్థుల ఎంపిక పట్ల పాఠశాలప్రధానోపాధ్యాయులు బి. ఈశ్వర్ ప్రసాద్, ఉపాధ్యాయ బృందం, ఫిజికల్ డైరెక్టర్లు కమ్మళ్ల భాషా, అజీమ్ బాషా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రస్థాయిలో కూడా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షిస్తూ విద్యార్థులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *