జనం న్యూస్ 30 జూన్ 2026, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్, సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ సమి : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్: భారత ఎన్నికల సంఘం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 22, 23వ వార్డుల బూత్‌లలో జరుగుతున్న ఓటరు ఎస్ఐఆర్ జాబితా సవరణ ప్రక్రియను మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ముదిరాజ్, మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. షాద్‌నగర్ నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని తమ ఓటరు వివరాలను ధృవీకరించుకోవాలని కోరారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు అయ్యిందో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడంతో పాటు తమ కుటుంబ సభ్యులు, బంధువులు, పొరుగువారికి కూడా అవగాహన కల్పించి ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్ ముదిరాజ్, 6వ వార్డు కౌన్సిలర్ రాజు నాయక్, కిషోర్ యాదవ్, అగ్గనూర్ రవితేజ సురేష్, పరమేశ్వర్, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు తదితరులు పాల్గొన్నారు.