ఎస్ఎఫ్ఐ నుండి అఖిల్ బహిష్కరణ

జనం న్యూస్, మన్యం జిల్లా పార్వతీపురం, జూన్ 30 భారత విద్యార్థి ఫెడరేషన్( ఎస్ఎఫ్ఐ ) మన్యం జిల్లా ఓబి కమిటీ సభ్యుడు కె. అఖిల్ ను అన్ని ఎస్ఎఫ్ఐ కమిటీల నుండి మరియు ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు హిమరక సింహాచలం, బిడ్డిక అనిల్ తెలియజేశారు. పత్రికా విలేకరులకు సోమవారం నాడు విడుదల చేసిన ఒక ప్రకటనలో మాట్లాడుతూ అఖిల్ ఎస్ఎఫ్ఐ నిబంధనలకు విరుద్ధంగా, విద్యార్థినిల పట్ల అసభ్యకరంగా, నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నాడని పలుమార్లు అతని దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అఖిల్ ను మన్యం జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీల నిర్ణయం మేరకు ఎస్ఎఫ్ఐ లో ప్రాథమిక సభ్యత్వం నుండి మరియు కమిటీల నుండి బహిష్కరించాలని జిల్లా కమిటీ నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఓబి సభ్యులు జి. సురేష్, ఆరిక రంగారావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *