,బండ కొత్త పల్లి గ్రామం లో మహాత్మగాంది జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పతకం లో పశువుల షెడ్లు మరియు ఇంకుడు గుంతలు తవ్వుకొన్న వారికి చెక్కులు పంపిణి చేసిన సర్పంచ్

జనం న్యూస్, గుండాల జూన్.30.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGS)లో భాగంగా పశువుల బార్క్ షెడ్లుమరియు ఇంకుడు గుంతలు నిర్మించుకొన్న లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గద్వాల.ఉపేందర్ మాట్లాడుతూప్రతి రైతు పశువుల భార్క్ షెడ్లు మరియు అర్హులైన ప్రతి కుటుంబం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలనిప్రభుత్వం ఇందుకోసం ఆర్థిక సహాయం అందిస్తున్నదని ఆయన తెలిపారు. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, పర్యావరణ పరిరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నాడు అలాగే పశుసంవర్ధక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న బార్క్ షెడ్ల సదుపాయాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని ఆయన గ్రామ ప్రజలను కోరారుఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపాలదాస్ యాదగిరివార్డు సభ్యులుబాదే శాంతమ్మబాదే యాకమ్మసుధాకర్ ఫీల్డ్ అసిస్టెంట్ రేణుక, గ్రామ కార్యదర్శి నరేందర్ రెడ్డిగ్రామస్థులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *