జనం న్యూస్ 28జూన్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనూర్; గ్రామపంచాయతీ పరిధిలోని గణేశ్ నగర్ ఆవరణంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కొడప ప్రకాష్ గారు, ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్,సర్పంచ్ గారు మాట్లాడుతూ, “ప్రతి 0- 5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ మురళీకృష్ణ సిబంది మరియు ఆశా వర్కర్లు అంగన్వాడి టీచర్లు గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.