జనం న్యూస్ మధిర జూన్ 28, దోర్నాల కృష్ణ ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వీ అన్నవరం గ్రామంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గూడపాటి రాము పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, “చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు పల్స్ పోలియో కార్యక్రమం ఎంతో కీలకం. ప్రతి తల్లితండ్రులు ఐదేళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని రెండు చుక్కలతో చిన్నారులు జీవితాంతం వికలాంగత్వం నుంచి కాపాడవచ్చని ఆరోగ్యవంతమైన భావితరాల కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపినారుఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ మల్లెల నరసింహారావు వివిధ హోదాలో ఉన్న నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.