జనంన్యూస్ జూన్ 28 ఎలిగేడు మండలం 5, సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించి జూన్ 28 ఆదివారము రోజున నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని చిన్నారుల తల్లి దండ్రులు సద్వినియోగం చేసు కోవాలి అని ఎలిగేడు గ్రామ ఉపసర్పంచ్ ముంజ నరేష్ తెలియ జేశారు . 28 ఆదివారము రోజున నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాలు మండల కేంద్రము లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ,గ్రామ పంచాయతీ లలో ,హెల్త్ సబ్ సెంటర్లు తదితర కేంద్రాలలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యములో పల్స్ పోలియో కార్యక్రమాలు జరుగు తున్నాయి అన్నారు .0–5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలను వేయించడం వలన పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించ వచ్చు అన్నారు . పోలియో రహిత భారత దేశ నిర్మాణంలో ప్రతి చిన్నారి తల్లి దండ్రి తమ వంతు బాధ్యతగా వ్యవహరించి పిల్లలకు తప్పని సరిగా పోలియో చుక్కలను వేయించాలి అంటూ చిన్నారుల తల్లిదండ్రులను కోరారు .