ఎస్ఐఆర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: తహసిల్దార్ తారాబాయి

జనం న్యూస్ 27 జూన్ 2026 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా. ప్రత్యేక ఓటర్‌ జాబితా సవరణ కార్యక్రమం సర్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రుద్రూర్ తహసీల్దార్ తారాబాయి అన్నారు. మండలంలోని అక్బర్ నగర్ గ్రామంలో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియను శుక్రవారం పరిశీలించారు. గ్రామంలోని పలువురి ఇంటికి వెళ్లి సర్‌పైఅవగాహన కల్పించారు. అనంతరం ఎన్యూమరేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సర్‌ కార్యక్రమం 2002 సంవత్సరంలో జరుగగా ప్రస్తుతం మళ్లీ సవరణ జరుగుతుందన్నారు. ఓటర్‌ జాబితా సవరన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సురేందర్ నాయక్, సూపర్వైజర్ గంగాధర్, భారతి, బిఎల్ఓ అనసూయ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *