హత్యాయత్నం కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్. కే శశిధర్

జనం న్యూస్ మధిర జూన్ 25, దోర్నాల కృష్ణ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామంలో భూ సరిహద్దు పొలం గట్టువివాదం నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసును గంపలగూడెం పోలీసులు ఛేదించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.ఫిర్యాదు మేరకు, 23-06-2026 తేదీన పొలం గట్టు విషయమై రెండు కుటుంబాల మధ్య వివాదం చోటుచేసుకోగా, 24-06-2026 తెల్లవారుజామున నిందితులు కర్రలు మరియు రోకలి బండతో ఫిర్యాదిదారుడి ఇంటి వద్దకు వెళ్లి బిక్షాలు అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనలో బాధితుడికి తలతో పాటు శరీరంలోని పలు భాగాలపై తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గంపలగూడెం పోలీస్ స్టేషన్‌లో సి ఆర్ నెంబర్73/2026 యూఎస్ 329(4), 109(1) 3(5) బిఎన్ఎస్* కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితులైన వేల్పుల అజయ్, వేల్పుల గోపి, వేల్పుల చిన్ని కృష్ణ, వేల్పుల అనిల్ మరియు వేల్పుల చిట్టిబాబు* అను వారిని ఉదయం సుమారు 09.00 గంటలకు భగవానులపురం ఎక్స్ రోడ్ వద్ద గంపలగూడెం కె. శశిధర్ అరెస్ట్ చేశారు.అనంతరం నిందితులనుII అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ జేఎఫ్‌సీఎం, తిరువూరు వారి న్యాయస్థానంలో హాజరుపరచడం జరిగిందిభూ వివాదాలు, కుటుంబ కలహాలను చట్టబద్ధ మార్గంలో పరిష్కరించుకోవాలని, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని గంపలగూడెం పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *