
జనం న్యూస్ సెప్టెంబర్ 02 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)గోరంట్ల: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు బోయ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు జి.ఎం. శేఖర్ ఆదేశాల మేరకు, జిల్లా ఇన్‌చార్జ్ కునిగిరి నీలకంఠ సూచనలతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శులు హరికృష్ణ గౌడ్, సురేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేసి భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వాటి ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను తెలియజేయాలని నాయకులు సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు.న కార్యదర్శి సద్దా వెంకటాచలం, సొసైటీ డైరెక్టర్ గంగాధర్, నాగరాజు యాదవ్, హరీష్, లక్ష్మీనరసు, నగేష్, అశోక్, బాలకృష్ణ గౌడ్, గుంటుపల్లి చంద్ర, కొత్తిమీర వెంకటేష్, జయరాం నాయక్, మార్కెట్ డైరెక్టర్ రామంజమ్మ, లక్ష్మీదేవి, మహిళా మండల అధ్యక్షురాలు పార్వతీబాయి, శాంతమ్మ, లక్ష్మారెడ్డి, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.