వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన వైసిపి నాయకులు

🖨️ Print

జనం న్యూస్ సెప్టెంబర్ 02(గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా గోరంట్ల పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. మ్మయ్యగారిపల్లి వద్ద ఉన్న డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి మహానేతను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, జలయజ్ఞం, 108 అత్యవసర వైద్య సేవలు, 104 ఆరోగ్య సేవలు వంటి పథకాలు ఆయన పాలనలో ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు.అలాగే పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ఆరోగ్యశ్రీ పథకం, విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతులకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలు వైఎస్సార్‌ను ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపాయని పేర్కొన్నారు.మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *