
జనం న్యూస్/సెప్టెంబర్ 03/పోలవరం నియోజకవర్గం /రిపోర్టర్ : సోమరాజు నడపాల జనసేన పార్టీ వ్యవస్థాపకులు,ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీ రాజ్,అటవీ శాఖ,మంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ 55 వ పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ మండల అధ్యక్షులు గణేషుల ఆదినారాయణ ఆధ్వర్యంలో జనసేన నాయకులు వీర మహిళలు, కార్యకర్తల నడుమ అంగరంగ వైభవం నిర్వహించడం జరిగింది. మొదటి ఆదినారాయణ ఇంటి వద్ద కేక్ కటింగ్ నిర్వహించి అనంతరం ప్రభుత్వ వైద్యాశాలలో రోగులు పాలు రొట్టెలు అందజేయడం జరిగింది.ఈ సందర్బంగా మండల అధ్యక్షులు ఆదినారాయణ మాట్లాడుతూ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుండి ఎన్నో అవరోధలను ఎదురకుంటూ 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన పాత్ర పోసించడం జరిగింది అని అన్నారు. అయన కి అప్పగించిన శాఖలను సమర్ధవంతంగా నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడం జరిగింది అన్నారు.అయన ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుతూ వారికీ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జిల్లా నాయకులు నియోజకవర్గ స్థాయిలో జంగారెడ్డిగూడెం నిర్వహించిన జనసేన సమావేశానికి భారీగా తరలి వెళ్లడం జరిగింది.ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు పొట్ల మోహన్ దొర, కొవ్వాల క్రాంతికుమార్, మంచర్ల సమ్మయ్య, దేవిరెడ్డి సుధాకర్, మచార్ల వెంకటేశ్వర్లు,లక్ష్మి, శ్రీదేవి, సాంబ, సాయి, శివ, ప్రవీణ్, ఖాదర్, బాలరాజు, విష్ణు, రవితేజ, రాజేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.