సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి.

జనం న్యూస్ 30జూన్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్. కె ఏలియా. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంర్ఫ్ ) నుండి మంజూరైన చెక్కుల పంపిణీ చేసిన ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి ఆసిఫాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్వయంగా అందజేశారు. వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న పేద కుటుంబాలకు మొత్తం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… “పేద ప్రజలు అనారోగ్యం బారిన పడితే ఆర్థికంగా చితికిపోకూడదనే గొప్ప ఆశయంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు చేసిన నిరుపేదలకు ఈ చెక్కులు ఎంతో ఊరటనిస్తాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇప్పటివరకు వేలాది మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించాం. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన 15 రోజులలోపు దరఖాస్తు చేసుకుంటే త్వరగా మంజూరు అవుతుంది. దళారులను నమ్మి మోసపోవద్దు” అని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ , వైస్ చైర్మన్ అహ్మద్ గారు, కౌన్సిలర్ లు చిలువేరి వెంకన్న , బాలకృష్ణ , సలాం , జబోరే రవీందర్ , లక్ష్మణ్ , స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *