జనం న్యూస్ జూన్ 28 చిట్యాల మండల ప్రతినిధి శ్రీనివాస్ జయశంకర్ జిల్లా భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మండలంలో రైతుల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారాలు వేగవంతంగా జరుగుతున్నాయని రైతులు వారి గ్రామాల గ్రామ పాలన అధికారులను సంప్రదించి వారి దరఖాస్తులను పరిష్కరించుకోవాలని ఈ అవకాశంను రైతులు త్వరగా సద్వినియోగం చేసుకోవాలని స్థానిక మండల తాసిల్దార్ టి వసంతరావు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. పొట్టి దరఖాస్తుల వివరాలు తాసిల్దార్ తెలుపుతూ జూన్ రెండవ తేదీ 2014 సంవత్సరంలోపు రైతులు కొనుగోలు చేసినటువంటి భూములు మరియు వారసత్వ ప్రకారంగా పట్టాలు కాకుండా ఉన్నటువంటి భూముల సమస్యలు గల రైతులు అక్టోబర్ 2020 లో సాదా బైనమా ద్వారా దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులపై ప్రస్తుతం కోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సూచన ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా అర్హత గల రైతులకు పట్టాలు చేయడం జరుగుతుందని తహసిల్దార్ వివరాలు తెలిపారు. కాబట్టి సాదాబైనమాలలో దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు గ్రామ పరిపాల అధికారులకు వద్దకు వచ్చి తమ దరఖాస్తులను త్వరగా పరిష్కరించుకోవాల్సిందిగా రైతులను కోరడం జరిగింది