మెదక్: పాము కాటుతో భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం

జనం న్యూస్ 1/జులై టేక్మాల్ ప్రతినిధి మెదక్ జిల్లా టేక్మాల్ మండలం బోడగట్టు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సంగమేష్, అతడి భార్య కవిత ఇంట్లో నిద్రిస్తుండగా వారు పాము కాటుకు గురయ్యారు. వెంటనే వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో కవిత మృతి చెందింది. సంగమేష్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *