
జనం న్యూస్, గుండాల సెప్టెంబర్. 3.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్త పల్లి గ్రామం లోగ్రామ సర్పంచ్ గద్వాల. ఉపేందర్ అధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ మాట్లాడుతూ పేదల.రైతుల.బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్,ఉచిత విద్యుత్,108 ఉచిత అంబులెన్స్, వృద్ధాప్య పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు సంక్షేమం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి అని కొనియాడాడు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన అన్నాడు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ గోపాలదాస్ రాములు,ఎల్కా స్వాతి-రమేష్ రెడ్డి,చీకటి ఉషా-ఉపేందర్,బాధే యాకమ్మ.సుధాకర్,బూర్గుల నరసయ్య,బాధే శాంతమ్మ.దానెలు మరియు మహిళా సంఘ నాయకురాలు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు