ఎస్.కోటలో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కటింగ్.. భారీ బైక్ ర్యాలీ
🖨️ Print

ఎస్.కోట, జనం న్యూస్ ప్రతినిధి రావాడ నాయుడు):జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఎస్.కోట నియోజకవర్గంలో జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ జన్మదిన వేడుకలకు కూటమి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.కొత్తవలస నుంచి ఎల్.కోట, వేపాడ మీదుగా ఎస్.కోట వరకు భారీ బైక్ ర్యాలీ కొనసాగింది. జనసేన జెండాలు చేతబట్టి, పవన్ కళ్యాణ్ నినాదాలతో కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజా సేవ, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గవ్యాప్తంగా జనసేన శ్రేణులు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. భారీగా నిర్వహించిన బైక్ ర్యాలీతో ఎస్.కోటలో పండుగ వాతావరణం నెలకొందిఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *