పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా శ్రామికులకు అల్పాహారం, మజ్జిగ పంపిణీ

🖨️ Print

లక్కవరపుకోట, సెప్టెంబర్ 02 (జనం న్యూస్ ప్రతినిధి రావాడ నాయుడు):ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని గంగుపూడి గ్రామంలో జనసేన నాయకులు సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న శ్రామికులందరికీ అల్పాహారం, టిఫిన్స్‌తో పాటు మజ్జిగ పంపిణీ చేశారు. శ్రామికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జనసేన నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గంగుపూడి జనసేన నాయకుడు మొల్లు రాజుతో పాటు గ్రామ పెద్దలు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *