జనం న్యూస్ గొడుగు సుధాకర్ తిరుమలగిరి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మేకల సతీష్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలగిరి మండల పార్టీ అధ్యక్షులు గంట లక్షమన్ విలేఖర్ల సమావేశములో మాట్లాడుతూ అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన. హామీలను అమలుచేయడం లొ విఫలం అయింది అని లక్షమన్ అన్నారు. 18 స. లు నిండిన ప్రతి మహిళకు. 2500 వయో వృద్ధులకు పిక్షన్ 4000 పెళ్లి చేసుకున్న ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్షమి తులo బంగారo ఇస్త అన్నది మీరే కదా ఇందిరమ్మ ఇండ్లను తిరుమగిరి మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడ ఇవ్వలేదు అని లక్షమన్ అన్నారు. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలు చేయని యెడల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇండ్లు లేని పేదల పక్షాన నిలబడి దర్నాలు రాస్తారోకోలు నిర్వహింస్తా మని లక్మమన్ అన్నారు. ఈ సమావేశం లో మద్దెల దీప్, అల్లే ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.