జనం న్యూస్ 27 జూన్ 2026 మొయినాబాద్ ప్రతినిధి మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హిమాయత్ నగర్ ప్రజల హక్కుల కోసం నాలుగు యువజన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో 60 గజాల స్థలం కోసం పోరాటం కొనసాగుతోంది.సర్వే నంబర్ 151 లో మా ప్లాట్లు మాకు కావాలిమన హక్కు కోసం పోరాడితే గెలుపు మనదే!బానిసత్వం కాదు స్వాభిమానం మన లక్ష్యం 60 గజాలు వచ్చుడో చచ్చుడో ఈ పోరాటంలో యువజన నాయకులు, సంఘాల అధ్యక్షులు, గ్రామ ప్రజలు ఏకమై నిలబడి తమ హక్కులను సాధించుకోవడానికి కట్టుబడి ఉన్నారు.ఇందులో ఏ రాజకీయ నాయకుని ప్రమేయం లేదు. ఇది పూర్తిగా ప్రజల హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమం.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ అధ్యక్షుడు కట్టమీది శ్రీను,శాంతి యువజన సంఘం అధ్యక్షుడు కుమ్మరి విటల్, మౌలానా అబ్దుల్ కాలం అజాద్ సంఘ అధ్యక్షుడు కరీం, సేవాలాల్ యువజన సంఘ అధ్యక్షుడు గోపాల్,సిపిఐ పార్టీ చేవెళ్ల డివిజన్ అల్లి దేవేందర్, సిపిఐ పార్టీ మొయినాబాద్ ప్రవీణ్, మరియు గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు.