నృత్యంలో ప్రథమ బహుమతి సాధించిన తన్వితకు ఘన సన్మానం

జనం న్యూస్,జూన్ 26 ( జిల్లా ఇంచార్జ్ ) ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన కళా సమ్మేళనం-2026 నృత్య ప్రదర్శన పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన వంగర గ్రామానికి చెందిన చిన్నారి బిల్లా తన్వితను హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పట్టణంలోని పద్మాలయ క్లాత్ షోరూంలో జరిగిన కార్యక్రమంలో బీసీ జేఏసీ గౌరవఅధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ ముఖ్య అతిథిగా పాల్గొని తన్వితను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాట్యాచార్యుడు వెంకటేశ్వర్లు శిక్షణలో ప్రతిభ కనబరిచి హుజురాబాద్‌కు గుర్తింపు తీసుకొచ్చిన తన్విత భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు, సభ్యులు పాల్గొని తన్వితతో పాటు ఆమె తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *