గ్యారంపల్లి పిహెచ్సి పరిధిలో ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు: డి డి ఓ హరి నాయక్

జనం న్యూస్ (కె.వి.పల్లి మండలం అన్నమయ్య జిల్లా)జూన్ 28:- రిపోర్టర్ శివకుమార్ కె.వి.పల్లి మండలంలోని గ్యారంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ పోలియో టీకా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్యారంపల్లి పీహెచ్సీ డి డి ఓ హరి నాయక్ మరియు ప్రధాన వైద్య అధికారి డాక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం శకుంతలతో పాటు వైద్య సిబ్బంది పాల్గొని ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి తప్పని సరిగా పోలియో టీకా వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని ఈ సందర్భంగా వైద్యాధికారి సూచించారు. పిల్లలను ఆప్యాయంగా పలకరించి, వారికి పోలియో చుక్కలు వేయడంతో పాటు తల్లిదండ్రులకు పోలియో నివారణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడి కార్యకర్తలు, తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *